భారతదేశం, ఆగస్టు 25 -- SCR Charlapalli Kakinada Special Trains : హైదరాబాద్‌ నుంచి కోస్తాంధ్ర వైపు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. రాఖీ పండగతో పాటు సెలవులు ఉండటంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో చర్లపల్లి - కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను (Special Trains) నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన పట్టణాలను అనుసంధానిస్తూ ఈ ప్రత్యేక రైళ్లకు హాల్ట్‌లను కేటాయించారు. ఈ రైళ్లు రెండు మార్గాల్లోనూ పలు స్టేషన్లలో ఆగుతాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం.... నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ,గుడివాడ,భీమవరం,తణకు, రాజమండ్రి,సామర్లకోటలో హాల్ట్ ఉంటుంది.

ప్రయాణికుల అన్ని వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లలో బోగీలను అమర్చారు. వీటిలో ఫస్ట్ ఏసీ...