భారతదేశం, ఏప్రిల్ 18 -- ప్రపంచ చమురు మార్కెట్‌లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల విషయంలో అమెరికా అగ్రరాజ్యం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. రష్యా ఆయిల్‌పై ఉన్న ఆంక్షల మినహాయింపును (Sanctions Waiver) పొడిగించబోమని గతంలో స్పష్టం చేసిన డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు తన మాట మార్చుకుంది. సముద్ర మార్గం ద్వారా వచ్చే రష్యా చమురును మే 16 వరకు కొనుగోలు చేసేందుకు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెద్ద ఊరటగా మారింది.

నిజానికి, రష్యా చమురు కొనుగోళ్లపై మినహాయింపు ఇచ్చే ఆలోచన ఏదీ లేదని కేవలం రెండు రోజుల క్రితమే అమెరికా ఖజానా శాఖ (Treasury Department) కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ కుండబద్దలు కొట్టారు.

"రష్యా ముడి చమురుపై గానీ, ఇరాన్ ఆయిల్‌పై...