భారతదేశం, ఏప్రిల్ 11 -- రష్మిక మందన్నకు ఏ మాత్రం డిమాండ్ తగ్గటం లేదు. ఆమె నటించిన మూడు చిత్రాల షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఆ చిత్రాలు చిత్రీకరణ దశలోనే ఉండగా ఓటీటీకి భారీ ధరకు అమ్ముడయ్యాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోల సరసన నటించింది శ్రీవల్లి.

ఆమె కన్నడ నుంచి తెలుగులోకి వచ్చి.. వరుసగా అవకాశాలు దక్కించుకుంది. టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉంది. తొలి చిత్రం చలోతో ఎంట్రీ ఇచ్చి తర్వాత వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టాలీవుడ్‌లో రష్మిక గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకుంది. కెరీర్ ఆరంభంలోనే స్టార్ నటులతో నటించే అవకాశం లభించింది.

కన్నడ, తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలలోకి అడుగుపెట్టిన రష్మిక, మలయాళ చిత్రాలలో నటించకపోవడం మినహా, మిగతా అన్ని భాషల్లోని సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. రష్మిక మందన్న ప్రస్తుతం విజయ్...