భారతదేశం, అక్టోబర్ 19 -- ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని ప్రభుత్వం ఎంతమాత్రం వమ్ము చేయలేదని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతి సమీపంలోని ఉండవల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పరిణామాలు, ప్రతిపక్ష వైకాపా తీరుపై సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. నిరుద్యోగులకు ఎంతో లబ్ధి చేకూర్చే మెగా డీఎస్సీని నిలిపివేసేందుకు కోర్టుల చుట్టూ తిరిగారని, చివరికి రోడ్లను సైతం తవ్వుతూ తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ చేసిన అరాచకాలు, విధ్వంసకర రాజకీయాలు ప్రజల మనసుల నుంచి ఎప్పటికీ తుడిచి...