భారతదేశం, ఆగస్టు 26 -- రక్షాబంధన్ వచ్చేస్తోంది. రక్షాబంధన్‌కి అందరూ కూడా ప్రిపరేషన్స్‌ను మొదలు పెట్టేసి ఉంటారు. ఈ ఏడాది రక్షాబంధన్ ఆగస్టు 28న వచ్చింది. అయితే, ఈ రక్షాబంధన్ రోజున ఏ రాశుల వారికి ఏ రంగు కలిసొస్తుంది? ఏ రాశుల వారు ఏ రంగు దుస్తులను ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: మేష రాశి వారికి ఎరుపు లేదా స్కార్లెట్ బాగా కలిసి వస్తుంది. ఈ రాశికి అధిపతి కుజుడు. శక్తి, ఉత్సాహం, ధైర్యానికి ప్రతీక కుజుడు. ఈ రాశి వారు ఈ రంగులను ధరిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

వృషభ రాశి: వృషభ రాశి వారు తెలుపు లేదా లేత గులాబీ రంగు దుస్తులను ధరిస్తే బాగా కలిసి వస్తుంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అందం, సౌకర్యం, మాధుర్యానికి ప్రతీక. తెలుపు లేదా గులాబీ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే మీకు బాగా కలిసి వస్తుంది.

మిథున రాశి: మిథున రాశికి అధ...