యూసీసీ అంటే హిందూ సివిల్ కోడ్ రుద్దడమే: దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్‌పై అసదుద్దీన్ ఒవైసీ మండిపాటు
భారతదేశం, నవంబర్ 10 -- మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్న యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)పై ఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యూసీసీ పేరుతో ఇతర మతాల ప్రజలపై 'హిందూ సివిల్ కోడ్'ను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. మంగళవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీజేపీ, దాని భాగస్వామ్య పక్షాలు ఏలుతున్న మహారాష్ట్రలో యూసీసీ అమలును, చట్టసభల్లో దాని బిల్లు ఆమోదాన్ని తమ పార్టీ శక్తివంచన లేకుండా అడ్డుకుంటుందని స్పష్టం చేశారు.
"దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం రాష్ట్రంలో యూసీసీని అమలు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది" అని ఒవైసీ పేర్కొన్నారు. యూసీసీ అమలు ప్రక్రియలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రశ్నావళిపై ఆయన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.