భారతదేశం, నవంబర్ 16 -- ఉన్నత విద్య కోసం బ్రిటన్ గడ్డపై అడుగుపెట్టాలని కలలు కనే భారతీయ విద్యార్థుల సంఖ్య ఎక్కువే. అయితే యూకే ప్రభుత్వం వలస నిబంధనలను క్రమంగా కఠినతరం చేస్తుండటంతో విదేశీ విద్యార్థుల జోరుకు బ్రేక్ పడింది. 2026 అక్టోబర్‌తో ముగిసిన ఏడాది కాలంలో యూకే స్పాన్సర్డ్ స్టడీ వీసా దరఖాస్తులు 20 శాతం తగ్గి 3,49,900కు పరిమితమయ్యాయి. అంతకుముందు 12 నెలల కాలంలో ఈ దరఖాస్తులు 4,34,000గా ఉండగా, తాజాగా భారీ తగ్గుదల కనిపించింది. నవంబర్ 12న యూకే హోం ఆఫీస్ విడుదల చేసిన అధికారిక గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

విదేశీ విద్యార్థులపై కఠినమైన వలస నిబంధనలు అమలు చేయడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని గణాంకాలు చెబుతున్నాయి. 2024 జనవరిలో ప్రవేశపెట్టిన ఆంక్షల ప్రకారం.. చాలామంది అంతర్జాతీయ విద్యార్థులు తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులను (డిపెండెంట్లను) యూకే...