భారతదేశం, నవంబర్ 4 -- అమెరికా రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలనపై అమెరికన్ ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ డెమొక్రాట్లకు అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు. ఈ మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించి రిపబ్లికన్లను కడిగేసింది. యు.ఎస్. కాంగ్రెస్‌లోని ఉభయ సభలు-హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (ప్రతినిధుల సభ), సెనేట్ రెండింటినీ స్వీప్ చేసి తమ తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంది.

ఈ గెలుపుతో వాషింగ్టన్‌లో అధికార సమతుల్యత పూర్తిగా మారిపోయింది. గడిచిన రెండేళ్లుగా వైట్‌హౌస్‌తో పాటు కాంగ్రెస్‌పై ఏకఛత్రాధిపత్యం వహించిన రిపబ్లికన్ల శకానికి తెరపడింది. ఇప్పుడు ట్రంప్‌కు చెక్ పెడుతూ, చట్టసభలు పూర్తి స్వతంత్ర శక్తిగా నిలబడటానికి బాటలు పరిచాయి.

"అమెరికా ప్రజలారా, మీ గళాన్ని మేం విన్నాం" అని ...