భారతదేశం, మార్చి 25 -- టెహ్రాన్: మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇరాన్ ఒక అడుగు ముందుకు వేసింది. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశిస్తున్నట్లుగా ఇది అంత సులభంగా ముగిసేలా కనిపించడం లేదు. యుద్ధం ఆపడానికి ఇరాన్ ప్రభుత్వం ఐదు ప్రధాన డిమాండ్లను తెరపైకి తెచ్చింది. వాషింగ్టన్ ఈ డిమాండ్లను అంగీకరిస్తేనే తుది ఒప్పందం కుదురుతుందని ఇరాన్ గట్టిగా చెబుతోంది.

ట్రంప్ ప్రభుత్వం చర్చలు 'చాలా బాగున్నాయి' అని ప్రకటిస్తున్నప్పటికీ, ఇరాన్ మాత్రం తన పట్టు సడలించడం లేదు. ముఖ్యంగా తన సార్వభౌమాధికారం, భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది.

ఈ ఐదు డిమాండ్లలో ముఖ్యంగా హార్ముజ్ జలసంధిపై పట్టు, క్షిపణి వ్యవస్థపై ఆంక్షలు వద్దు అనే అంశాలు అమెరికాకు మింగుడుపడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో ఎక్కువ భాగం ఈ...