భారతదేశం, జూన్ 30 -- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన అభివృద్ధి, భూ కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(MCRHRD) బోధి పవిలియన్‌లో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఆలయ అభివృద్ధి పనులను ఆయన నిశితంగా పరిశీలించారు. యాదగిరిగుట్టలో భూముల కేటాయింపునకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి, ఇక్కడ కూడా అదే తరహా పద్ధతిని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌కు మార్కెట్ ధర ప్రకారమే భూమిని కేటాయించాలని స్పష్టం చేశారు. అలాగే ఆలయ పరిధిలో వివిధ మఠాలకు, కుల సంఘాలకు భూములు కేటాయించే విషయంలో స్పష్టమైన నిబంధనలతో కూడిన ఒక నిర్దిష్టమైన విధానాన్...