భారతదేశం, ఫిబ్రవరి 25 -- భారతీయులకు 'సొంత ఇల్లు/స్థలం' అనేది ఒక ఎమోషన్. కానీ ఆకాశాన్నంటుతున్న ధరల వల్ల అది సామాన్యులకు కలగానే మిగిలిపోతోంది. ఇక్కడే 'రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్' (REIT) ఒక విప్లవాత్మక మార్పుగా ప్రవేశించింది. మ్యూచువల్ ఫండ్ల లాగానే సులభంగా, స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఈ కొత్త పెట్టుబడి విధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మన తాతల కాలంలో భూమి అంటే కంటికి కనిపించే ఆస్తి. 90ల తర్వాత మ్యూచువల్ ఫండ్లు (SIPలు) వచ్చి పేపర్ ఆస్తుల విలువను పరిచయం చేశాయి. ఇప్పుడు 2026లో REITs రూపంలో మనం 'డిజిటల్ ఓనర్లు'గా మారుతున్నాం.

సులభంగా చెప్పాలంటే, వందల కోట్ల విలువైన కమర్షియల్ బిల్డింగులను (ఉదాహరణకు మైండ్‌స్పేస్, ఎంబసీ ఐటీ పార్కులు) చిన్న చిన్న యూనిట్లుగా విడగొడతారు. మీరు ఒక యూనిట్ కొంటే, ఆ బిల్డింగ్ ఇచ్చే అద్దెలో మీకు వాటా వస్తుంది....