భారతదేశం, నవంబర్ 3 -- జనగామ జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూళ్లలో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 32 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నియామకాలు 09.11.2026 నుండి 31.03.2027 వరకు లేదా అవసరం ముగిసే వరకు(ఏది ముందైతే అది) ఒప్పంద ప్రాతిపదికన కొనసాగుతాయి. మొత్తం 8 మోడల్ స్కూళ్లకు ఖాళీలను కేటాయించారు.

ఆర్ట్ టీచర్ 8 పోస్టులు -రూ.22,750 జీతం, యోగా టీచర్ 8 పోస్టులు-రూ.22,750, కంప్యూటర్ టీచర్-8పోస్టులు రూ.22,750, లైబ్రేరియన్ 8 పోస్టులు రూ.19,500 జీతంతో మొత్తం 32 ఖాళీలు ఉన్నాయి.

పోస్టులు ఉన్న పాఠశాల్లో బచ్చన్నపేట, ఘన్‌పూర్ (స్టేషన్), జనగామ (చౌదరం), కొడకండ్ల, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, లింగాల ఘన్‌పూర్, నర్మెట్ట మోడల్ స్కూళ్లు ఉన్నాయి. అభ్యర్థుల కన...