భారతదేశం, అక్టోబర్ 31 -- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని పెద్దమంగళారం గ్రామంలో అర్ధరాత్రి వేళ తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కళాశాలలో సరదాగా గడిపి, స్నేహితులతో కలిసి వేడుక చేసుకున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఊహించని రీతిలో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో యశ్వంత్, మోక్ష చరణ్ అనే ఇద్దరు బీటెక్ విద్యార్థులు ఘటనా స్థలంలోనే మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మొయినాబాద్ సమీపంలోని కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో మోక్ష చరణ్ (20), యశ్వంత్ (20) కంప్యూటర్ సైన్స్ విభాగంలో మూడో సంవత్సరం చదువుతున్నారు. ఇటీవల కాలేజీలో నిర్వహించిన ఫెస్ట్ వైభవంగా ముగిసింది. వేడుకలు పూర్తయిన తర్వాత దాదాపు 10 నుంచి 12 మంది విద్యార్థుల బృందం కలిసి పెద్దమంగళారం పరిధిలోని ఓ బహిరంగ ప్రదేశ...