భారతదేశం, ఏప్రిల్ 9 -- ప్రస్తుతం మనం వాడుతున్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్లలో కాలింగ్‌తో పాటు డేటా తప్పనిసరిగా ఉంటోంది. మనకు అవసరం ఉన్నా లేకపోయినా, రోజుకు 1GB లేదా 2GB డేటా కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారు, వృద్ధులు లేదా కేవలం బేసిక్ ఫోన్లు వాడే వారికి ఈ డేటాతో పెద్దగా పని ఉండదు. ఇటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.

నిజానికి గతంలోనే కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ ప్లాన్లను ఇవ్వాలని ట్రాయ్ సూచించింది. అయితే, టెలికాం కంపెనీలు ఇక్కడ ఒక తెలివైన ఎత్తుగడ వేశాయి. వాయిస్-ఓన్లీ ప్లాన్లను ప్రవేశపెట్టినప్పటికీ, వాటి ధరలను డేటాతో కూడిన ప్లాన్లకు సమానంగా లేదా అంతకంటే కొంచెం తక్కువగా ఉంచాయి. అంటే డేటా లేకపోయినా కస్టమర్ దాదాపు అంతే సొమ్ము చెల్లించాల్సి వచ...