మైసూరు దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు
భారతదేశం, అక్టోబర్ 21 -- కర్ణాటక రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే మైసూరు దసరా ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మైసూరు దసరా ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం జంబూ సవారిలో అందంగా అలంకరించిన ఏనుగుపై బంగారు అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు.
కన్నడ సంస్కృతిని ప్రతిబింబించే జానపద కళాకారులు, సంగీత బృందాలు, నృత్య బృందాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఈ ఊరేగింపులో పాల్గొన్నాయి. కర్నాటక నాడ హబ్బ (రాష్ట్ర పండుగ) ఉత్సవాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి, కళలు, చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయి.
కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీశన్తో పాటు ఎంతోమంది దేశ, విదేశాలకు చెందిన ప్రముఖుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.