భారతదేశం, మే 28 -- రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న జోరుకు అనుగుణంగా భూమి, రిజిస్ట్రేషన్ విలువలను సవరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి భూ లావాదేవీల రిజిస్ట్రేషన్ల కోసం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల(SRO) వద్ద భారీ రద్దీ నెలకొంది.

దీంతో తెలంగాణలో భూముల కొనుగోలు, అమ్మకాలు చేయాలనుకునే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని, మే 29 నుండి జూన్ 3 వరకు అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలను పొడిగించింది. ఇకపై ఈ నిర్ణీత రోజుల్లో ఉదయం 9:30 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా పుంజుకోవడంతో.. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అసలు ధరలకు, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలకు మధ్య చా...