భారతదేశం, ఫిబ్రవరి 5 -- ములుగు జిల్లాలోని మేడారంలో ఇటీవల జరిగిన సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ లైంగిక దాడికి సంబంధించిన నివేదికలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.
ఈ సంఘటనలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు యువకులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అన్ని మీడియా, సోషల్ మీడియా కథనాలు వైరల్ అయ్యాయి. వీటిని తాము పరిగణనలోకి తీసుకున్నట్లు మహిళా కమిషన్ పేర్కొంది.
ఈ విషయాన్ని పరిశీలించడానికి ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ రహత్కర్ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కమిషన్ సభ్యురాలు డెలినా ఖోంగ్డప్ అధ్యక్షత వహిస్తారు. ఎన్సీడబ్ల్యూ సీనియర్ కోఆర్డినేటర్ కంచన్ ఖత్తర్ సభ్యురాలిగా వ్యవహరిస్తారు. జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ నామినేట్ చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.