భారతదేశం, నవంబర్ 7 -- బ్రిటన్ రాచరిక కుటుంబంలో తీవ్ర సంచలనం నమోదైంది. ప్రిన్స్ హ్యారీ భార్య, డచెస్ ఆఫ్ ససెక్స్ మేఘన్ మార్కెల్ తండ్రి థామస్ మార్కెల్ (82)ను అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు అరెస్ట్ చేశారు. చిన్న పిల్లలకు సంబంధించిన అశ్లీల దృశ్యాలను ఉంచుకున్నారన్న తీవ్రమైన ఆరోపణలపై ఫ్లోరిడాలోని లేక్‌ల్యాండ్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ అధికారి ధ్రువీకరించారు.

లేక్‌ల్యాండ్‌లోని వృద్ధుల నివాస సముదాయం (సీనియర్ లివింగ్ కమ్యూనిటీ) వద్ద థామస్ మార్కెల్‌ను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారని 'డైలీ మెయిల్' పత్రిక వెల్లడించింది. మెక్సికోతో పాటు ఫిలిప్పీన్స్‌లో ఉన్న నిల్వ గదులు (స్టోరేజ్ యూనిట్లు), ఆయన పూర్వ నివాసంలో కూడా ఇటువంటి సామగ్రిని అధికారులు గుర్తించినట్లు సమాచారం.

గతంలో థామస్ మా...