భారతదేశం, సెప్టెంబర్ 5 -- మెగా డీఎస్సీ ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడిందని.. ఈ స్కామ్‌పై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) చేత స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నియామకాల్లో జరుగుతున్న అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం 'డిజిటల్ సెన్సార్‌షిప్'కు పాల్పడుతోందని ఆరోపించారు.

"డీఎస్సీ 2025 నియామకాల కుంభకోణం రోజురోజుకు బట్టబయలవుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోజూ కొత్త ఆధారాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తూ తీవ్రమైన అక్రమాలను బహిర్గతం చేస్తున్నాయి. దీనిపై చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం సమాధానం చెప్పాలి," అని జగన్ నిలదీశారు. ...