భారతదేశం, జూన్ 27 -- మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్‌బెడ్‌లో ఉన్న వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలని సమావేశంలో ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.

ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మూసీ మొదటి దశ ప్రాజెక్ట్ పైన అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టులో భాగంగా అవసరమైన చోట భూ సేకరణ కోసం ఆసక్తి ఉన్న వాళ్లకు టీడీఆర్ ఇవ్వాలి లేదా పరిహారం చెల్లించాలని చెప్పారు.

గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న రక్షణ శాఖ భూముల్లో ఉన్న నిర్మాణాలన...