భారతదేశం, ఆగస్టు 31 -- తెలంగాణను ప్రణాళికాబద్ధంగా మూడు ప్రధాన రంగాలుగా వర్గీకరించి మౌలిక వసతుల కల్పన దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మూసీ నదిపై నూతనంగా నిర్మించిన మూసారాంబాగ్ వంతెనను ప్రాంరంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

అంబర్‌పేట ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొద్దిపాటి వర్షానికే మూసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగేదని సీఎం గుర్తుచేశారు. దశాబ్ద కాలం అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయలేని పనిని తమ ప్రజా ప్రభుత్వం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే పూర్తి చేసిందని తెలిపారు.

గత ప్రభుత్వం నగరం బయట నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వల్ల ఇక్కడి ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. అందుకే అంబర్‌...