భారతదేశం, మార్చి 7 -- మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లో నిర్వాసితులు ఎవరికీ నష్టం జరక్కుండా అందరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 'కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు కొందరికి ఇబ్బంది ఉండొచ్చు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో ఎవరినీ అనాథలను చేయం. భూమి పోయినా, ఇండ్లు పోయినా ప్రభుత్వం మంచి నష్టపరిహారమిచ్చి ఆదుకుంటుంది. నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.' అని ముఖ్యమంత్రి చెప్పారు.

బుద్వేల్ లేఅవుట్‌తో కలిపే రేడియల్ రోడ్-2 ఇంటర్‌చేంజ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్వాలగూడలో ఎకో పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు.

మూసీ నది పూర్తిగా మురికితో నిండిపోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఇప్పు...