మూడో సంతానానికి 30 వేలు, నాలుగో సంతానానికి రూ. 40 వేల ప్రోత్సాహకం - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
భారతదేశం, మే 17 -- Andhra Pradesh population growth Policy : రాష్ట్ర జనాభా సమతుల్యత విషయంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. శనివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (Fertility Rate) వేగంగా పడిపోతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధోరణిని తిప్పికొట్టేందుకు, ఇకపై మూడు లేదా నాలుగో సంతానాన్ని కనే దంపతులకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలను అందించనున్నట్లు వెల్లడించారు.
ఈ నూతన పాలసీ ప్రకారం.. కుటుంబంలో మూడో (సంతానం) జన్మిస్తే తక్షణమే రూ.30,000, అలాగే నాలుగో బిడ్డ జన్మిస్తే రూ.40,000 నగదు సహాయాన్ని అందజేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాలను, సమగ్ర వివరాలను నెల రోజుల్లోగా అధికారికంగా విడుద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.