భారతదేశం, మార్చి 18 -- శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీ తీసుకురానున్నట్టుగా వెల్లడించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. 'జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను ఇచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. స్థల కేటాయింపులో న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందస్తు కార్యాచరణ చేపడుతున్నాం. మీడియా మిత్రులకు పూర్తి రక్షణ కల్పించే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు.' అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....