భారతదేశం, మే 13 -- ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన యాదవ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎస్పీ దిగ్గజం ములాయం సింగ్ యాదవ్, ఆయన రెండో భార్య సాధనా గుప్తాల కుమారుడు ప్రతీక్ యాదవ్ మే 13, బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ఈయన సోదరుడు (సవతి తమ్ముడు). 38 ఏళ్ల చిన్న వయసులోనే ప్రతీక్ మరణించడం లక్నోతో పాటు రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ప్రతీక్ యాదవ్ మరణంపై లక్నో సివిల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జి.పి. గుప్తా కీలక వివరాలు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రతీక్ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం అందడంతో వైద్య బృందం ఆయన నివాసానికి చేరుకుంది.

"వైద్యులు వెళ్లే సమయానికే ప్రతీక్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించాం. వైద్య బృందం శాయశక్తు...