భారతదేశం, అక్టోబర్ 5 -- తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరొక తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. పట్టణ స్థానిక సంస్థల్లో పాలనా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 886 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే అనుమతులు లభించగా, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.

పరిపాలనా సామర్థ్యం పెంచడానికి, సాంకేతిక, అకౌంట్స్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఇందులో కీలకమైన పోస్టుల ఉన్నాయి.

మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3) 20, డిప్యూటీ కమిషనర్ (స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు) 11, జూనియర్ అసిస్టెంట్ 86, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 56, హెల్త్ అసిస్టెంట్ 40, సీనియర్ అకౌంటెంట్ 4...