భారతదేశం, జూలై 15 -- కాపు సామాజికవర్గ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందడంతో ఆయన స్వగ్రామమైన కాకినాడ జిల్లా కిర్లంపూడిలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఆయన పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని కుటుంబ సభ్యులు, ముద్రగడ అనుచరులు అడ్డుకున్నారు. దీంతో కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గో బ్యాక్ క్రాంతి అంటూ ముద్రగడ అనుచరులు నివాసం వెలుపల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడ గందరగోళం వాతావరణం ఏర్పడింది.

ముద్రగడ పద్మనాభంతో ఆయన కుమార్తె క్రాంతికి కొంతకాలంగా తీవ్రమైన కుటుంబ, రాజకీయ విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఆయన కుమార్తె క్రాంతి మాత్రం ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా జనస...