భారతదేశం, మే 28 -- ముద్ఖేడ్-మేడ్చల్-మహబూబ్‌నగర్-డోన్ రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పరిధిలో భూసేకరణ, ప్రభుత్వ భూముల బదిలీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు.

దేశవ్యాప్తంగా సాగుతున్న కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, జాతీయ పథకాల అమలుపై ప్రధాని మోదీ న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన 'ప్రగతి' (PRAGATI) వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ సాయి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతిని ఆయన ప్రధానమంత్రికి నివేదించారు.

డోన్-మహబూబ్‌నగర్ రైల్వే ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 23.07 హెక్టార్ల ప్రైవేట్ భూమి అవసరమని సీఎస్ తెలిపారు. దీనికి సంబంధించిన సెక్షన్ 20(A) నోటిఫికేషన్‌ను 2025 సెప్టెంబర్ 25న జారీ చేసినట్లు పేర్కొన్నారు....