భారతదేశం, ఏప్రిల్ 30 -- అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో ముందెన్నడూ లేని విధంగా అనిశ్చితి నెలకొంది. ఇరాన్‌తో అణు ఒప్పందం కుదిరే వరకు హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద నౌకా దిగ్బంధాన్ని ఎత్తివేసే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు విఘాతం కలిగే ప్రమాదం ఏర్పడింది. గురువారం ఉదయం నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 1.50 శాతం పెరిగి బ్యారెల్‌కు 119.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ కూడా 107.26 డాలర్లకు చేరుకుంది.

ఇరాన్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని తిరస్కరించడమే కాకుండా, ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా ట్రంప్ పావులు కదుపుతున్నారు. ఆక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇరాన్ పరిస్థితిని చాలా తీవ్రంగా వర్ణించారు.

"బాం...