ముఖ్యమంత్రి విజయ్‌కి ఎదురుదెబ్బ.. ఆ జీవో కొట్టేసిన మద్రాస్ హైకోర్టు
భారతదేశం, జూలై 27 -- తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నియామకాలపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. కారుణ్య ప్రాతిపదికన సదరు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను (Government Orders) న్యాయస్థానం పూర్తిగా కొట్టివేసింది.
ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపులో చట్టం ముందు అందరూ సమానులేనని తెలిపే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో సమానత్వ హక్కును ప్రసాదించే ఆర్టికల్ 16లకు ఈ నియామకాలు విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది.
"ఇలాంటి అసాధారణ విధానాల ద్వారా ఉద్యోగాలు ఇస్తూ పోతే.. భవిష్యత్తులో జరిగే ఇతర ఘటనలకు సంబంధించి కూడా ఇటువంటి విజ్ఞప్తులు వెల్లువెత్తే ప్రమాదం ఉంది" అని ధర్మాసనం హెచ్చరించింది.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.