భారతదేశం, మే 15 -- తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం, డీఈఈసెట్ (Diploma in Elementary Education Common Entrance Test) హాల్ టికెట్లను మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు 15 మే 2026 ఉదయం 10:00 గంటల నుంచి వాట్సాప్ ద్వారా తమ హాల్ టికెట్లను వెంటనే పొందవచ్చు. డీఈఈసెట్ పరీక్ష ఈ నెల 21, 22 తేదీల్లో జరగనుంది.

వివరాలు సమర్పించిన వెంటనే డీఈఈసెట్ హాల్ టికెట్ వాట్సాప్‌లో అందుతుంది. ఈ సేవ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు పరీక్షలకు సంబంధించిన సేవలు వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, సౌకర్యవంతమైన, పారదర్శకంగా, సులభమైన డిజిటల్ సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో మీ సేవ ద్వారా పౌర సే...