భారతదేశం, జనవరి 13 -- టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, బ్యూటిపుల్ మీనాక్షి చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు. తెలుగులో ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మారి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే మారి డైరెక్టర్‌గా పరిచయం కానున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో అనగనగా ఒక రాజు విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో జనవరి 12న వరంగల్‌లో అనగనగా ఒక రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యూ డైరెక్టర్ మారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

చిత్ర దర్శకుడు మారి మాట్లాడుతూ.. "ముందుగా నేను కొంతమందికి థాంక్స్ చెప్పాలి. నేను ఈరో...