భారతదేశం, ఏప్రిల్ 11 -- ఫ్రిజ్ అనేది కేవలం ఆహారాన్ని నిల్వ చేసే యంత్రం మాత్రమే కాదు, వాస్తు రీత్యా అది ఒక శక్తి కేంద్రం. ఫ్రిజ్ నిరంతరం నడుస్తూ ఉష్ణాన్ని (Fire Energy) విడుదల చేస్తుంది. దీనిపై మనం పెట్టే వస్తువులు ఆ శక్తి ప్రవాహాన్ని అడ్డుకోవడమే కాకుండా, ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి. చాలా మంది స్థలం కలిసి వస్తుందని లేదా సౌలభ్యం కోసం ఫ్రిజ్ పైన కొన్ని వస్తువులను పెడుతుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ క్రింది 3 వస్తువులను ఫ్రిజ్‌పై అస్సలు ఉంచకూడదు.

చాలా ఇళ్లలో మందుల సీసాలను లేదా ట్యాబ్లెట్లను ఫ్రిజ్ పైన ఉంచడం చూస్తుంటాం. ఇది వాస్తు రీత్యా అత్యంత ప్రమాదకరం.

ప్రభావం: ఫ్రిజ్ నుండి వెలువడే విద్యుత్ అయస్కాంత తరంగాలు మరియు ఉష్ణం మందుల యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు. జ్యోతిష్య రీత్యా, ఫ్రిజ్‌పై మందులు ఉంచే ఇళ్లలో అనారోగ్య సమస్యలు ఎప్పుడూ వె...