భారతదేశం, మార్చి 25 -- హైదరాబాద్: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి బరువు చూసుకుంటాం, లేదా బిఎమ్‌ఐ (BMI) లెక్కిస్తాం. కానీ, మీరు ఎంత కాలం జీవిస్తారో చెప్పడానికి వీటన్నింటికంటే మీ కాళ్లలోని 'పిక్కల కొలత' అత్యంత కీలకమని చెబుతున్నారు హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్.

సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా ఆయన పంచుకున్న ఈ ఆసక్తికరమైన అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయుష్షును అంచనా వేయడానికి బరువు కంటే శరీరంలోని కండరాల శాతమే ముఖ్యమని ఆయన విశ్లేషించారు.

పిక్కల కండరాలను కేవలం శరీర సౌందర్యానికి సంబంధించినవిగా చూడకూడదని, అవి మన శరీరంలోని 'మెటబాలిక్ రిజర్వ్' (Metabolic Reserve)కు నిదర్శనమని డాక్టర్ సుధీర్ కుమార్ పేర్కొన్నారు. వయసు పెరిగే కొద్దీ సహజంగానే కండరాల సాంద్రత తగ్గ...