భారతదేశం, జూలై 26 -- జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడికి (కుజుడు) అత్యంత ప్రాధాన్యత ఉంది. కుజుడిని ధైర్యం, పరాక్రమం, నాయకత్వ గుణాలు, శక్తి మరియు భూమి సంబంధిత అంశాలకు కారకుడిగా పరిగణిస్తారు. జాతకంలో అంగారకుడి స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించడంలో ముందంజలో ఉంటాడు. అటువంటి కీలకమైన అంగారక గ్రహం తన స్థానాన్ని మార్చబోతోంది. రాబోయే ఆగస్టు 2వ తేదీన అంగారకుడు వృషభ రాశిని వీడి మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. కుజుడి ఈ రాశి మార్పు మొత్తం 12 రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులకు కారణమవుతుంది.

కొందరికి కెరీర్ పరంగా నూతన అవకాశాలు లభిస్తే. మరికొందరికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే ఏదైనా రాశి ఫలితం అనేది వ్యక్తి యొక్క వ్యక్తిగత జన్మకుండలి, ఆ సమయంలో నడిచే గ్రహ స్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ. ...