భారతదేశం, నవంబర్ 6 -- స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడు ఏ జరుగుతుందో ముందే ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ఆర్‌బీఐ లేదా ఫెడ్ వడ్డీ రేట్ల మార్పులు.. కారణం ఏదైనా షేర్ల ధరలు ఒక్కసారిగా హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. ఇలాంటి అస్థిర సమయాల్లో చాలామంది మదుపర్లు ఆందోళనకు గురై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, మార్కెట్ కదలికల కంటే కూడా మదుపర్లు తమ నియంత్రణలో ఉండే అంశాలపై దృష్టి సారించడమే ఏకైక పరిష్కారమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మార్కెట్ స్థిరంగా లేనప్పుడు మదుపర్లు చేయాల్సిన మొదటి పని తమ పెట్టుబడి లక్ష్యాన్ని పునఃపరిశీలించుకోవడం. రెండు మూడు దశాబ్దాల తర్వాత రిటైర్మెంట్ కోసం దాచుకునేవారి వ్యూహం, మరుసటి ఏడాదే డబ్బులు అవసరమయ్యే వారి ఆలోచన ఒకేలా ఉండవు. మీ కాలపరిమితి,...