భారతదేశం, మార్చి 27 -- భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఈ శుక్రవారం (మార్చి 27) ఒక 'బ్లాక్ ఫ్రైడే'గా మిగిలిపోయింది. గత రెండు రోజులుగా స్వల్పంగా కోలుకున్న మార్కెట్లు, వారాంతపు ట్రేడింగ్‌లో ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు ఇన్వెస్టర్లను వణికించాయి. కేవలం ఒక్క రోజులోనే మదుపర్ల ఆస్తి దాదాపు రూ. 9 లక్షల కోట్లు గాలిలో కలిసిపోయింది.

శుక్రవారం ట్రేడింగ్‌లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 1,690 పాయింట్లు (2.25%) పతనమై 73,583 వద్ద ముగిసింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 487 పాయింట్లు (2.09%) నష్టపోయి 22,820 వద్ద స్థిరపడింది. గతేడాది డిసెంబర్ 1న సెన్సెక్స్ తాకిన గరిష్ట స్థాయి (86,159) తో పోలిస్తే, ప్రస్తుతం మార్కెట్ 15 శాతం మేర పడిపోవడం గమనార్హం.

మార్కెట్...