భారతదేశం, జనవరి 26 -- ఎస్‌యూవీ (SUV) ప్రియులకు ఇది నిజంగా తీపి కబురు. ఒకప్పుడు భారత రోడ్లపై రారాజుగా వెలిగిన 'రెనో డస్టర్' మళ్ళీ కొత్త అవతారంలో మన ముందుకు వచ్చేసింది. మూడేళ్ల విరామం తర్వాత, సరికొత్త మూడవ తరం డస్టర్‌ను రెనో సంస్థ భారత్‌లో ఆవిష్కరించింది. మధ్యలో సెకండ్ జనరేషన్ మోడల్‌ను స్కిప్ చేసి, నేరుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లేటెస్ట్ వెర్షన్‌ను మన దేశానికి తీసుకురావడం విశేషం.

కొత్త డస్టర్ కోసం ఎదురుచూస్తున్న వారు రూ. 21,000 చెల్లించి ఇప్పుడే ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. కంపెనీ ప్రణాళిక ప్రకారం, ఈ కారు మార్చిలో అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానుంది. టర్బో-పెట్రోల్ వేరియంట్ల డెలివరీ ఏప్రిల్ మధ్య నుంచి ప్రారంభమవుతుంది. ఇక పర్యావరణ హితమైన స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ కోసం మాత్రం 2026 దీపావళి వరకు వేచి చూడాల్సి ఉంటుంది. మరో విశేషమేమిటంటే.....