భారతదేశం, జూన్ 15 -- ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) తన పాత, కొత్త కస్టమర్ల కోసం ఒక అద్భుతమైన అప్టర్-సేల్స్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. కారు నిర్వహణను మరింత సులభతరం చేస్తూ, పారదర్శకమైన యాజమాన్య అనుభవాన్ని అందించేందుకు 'స్మార్ట్ మెయింటెనెన్స్ ప్లాన్' (SMP) అనే ప్రీపెయిడ్ సర్వీస్ ప్లాన్‌ను ప్రారంభించింది.

ఈ ప్లాన్ ప్రైవేట్, వాణిజ్య (Commercial) వాహనదారులందరికీ అందుబాటులో ఉంటుంది. కొత్త కారు కొనుగోలు చేసే సమయంలో లేదా ఆ తర్వాత ఎప్పుడైనా అధీకృత మారుతి సుజుకి వర్క్‌షాప్‌ను సందర్శించినప్పుడు ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసే వెసులుబాటును కల్పించారు. కస్టమర్ల డ్రైవింగ్ అలవాట్లు, అవసరాలకు అనుగుణంగా ఇందులో పలు రకాల ఆప్షన్లు ఉన్నాయి.

కస్టమర్లు తమ అవసరాలకు తగినట్లుగా ఈ క్రింది ప్యాకేజీల నుండి ఎంచుకోవచ్చు:

లేబర్-ఓన్లీ ప్యాకేజీ...