భారతదేశం, జూలై 23 -- భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, తన ప్రజాదరణ పొందిన సబ్-4 మీటర్ ఎస్‌యూవీ 'బ్రెజా ఫేస్‌లిఫ్ట్' (2026 Maruti Suzuki Brezza facelift) విడుదల సమయానికి ముందే కీలక ప్రకటన చేసింది. బిఎన్‌సిఎపి (BNCAP) నిర్వహించిన భద్రతా పరీక్షల్లో ఈ సరికొత్త బ్రెజా ఫేస్‌లిఫ్ట్ మోడల్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. ఈ కారు రేపటి రోజున (జూలై 24న) మార్కెట్లోకి అధికారికంగా రానుంది.

క్రష్ టెస్ట్ ఫలితాల ప్రకారం, ఈ కారు పెద్దల భద్రత (Adult Occupant Protection - AOP) విభాగంలో 32 పాయింట్లకు గానూ 30.41 పాయింట్లు, అలాగే పిల్లల భద్రత (Child Occupant Protection - COP) విభాగంలో 49 పాయింట్లకు గానూ 43 పాయింట్లు సాధించింది.

ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో బ్రెజా ఫేస్‌లిఫ్ట్ 16 పాయింట్లకు గానూ 14.41 పాయింట్లు సాధ...