భారతదేశం, నవంబర్ 16 -- రొమ్ము ఆరోగ్యానికి సంబంధించి వైద్య పరీక్షల నివేదికలో అంతా సాధారణంగా (నార్మల్) ఉందని వస్తే ఎవరికైనా ఎంతో ఊరట కలుగుతుంది. అయితే కేవలం మామోగ్రామ్ రిపోర్ట్ నార్మల్‌గా ఉన్నంత మాత్రాన రొమ్ము క్యాన్సర్ ముప్పు పూర్తిగా లేదని భావించవచ్చా అంటే.. కచ్చితంగా చెప్పలేమనే సమాధానమే వినిపిస్తోంది. మామోగ్రఫీ పరీక్షలో ఎక్స్-రేల సాయంతో రొమ్ము కణజాలాన్ని పరిశీలిస్తారు. గడ్డ చేతికి తగలకముందే వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది.

అయినప్పటికీ ఇది అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించలేకపోవచ్చు. మహిళల శరీర తత్వం, రొమ్ము కణజాల సాంద్రతను (బ్రెస్ట్ డెన్సిటీ) బట్టి దీని కచ్చితత్వం మారుతుంది. ఈ పరిమితులను అర్థం చేసుకోవడం ద్వారా మహిళలు సరైన స్క్రీనింగ్ నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, తదుపరి వైద్య పరీక్షలు ఎప్పుడు అవసరమో తెలుసుకోవచ్చు....