భారతదేశం, సెప్టెంబర్ 15 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రోజురోజుకూ అపారమైన శక్తులను సంతరించుకుంటున్న వేళ, అంతర్జాతీయంగా దాని భద్రతపై ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఏఐ సాధిస్తున్న వేగానికి, దానిని సురక్షితంగా నియంత్రించేందుకు మానవులు చేస్తున్న ప్రయత్నాలకు మధ్య సమన్వయం తప్పుతోందని హెచ్చరిస్తూ గూగుల్ డీప్‌మైండ్ సేఫ్టీ రీసెర్చర్ బిలాల్ చుగ్తాయి తన పదవికి రాజీనామా చేశారు.

ఏఐ సాధిస్తున్న సాంకేతిక పురోగతి మానవాళి మనుగడకే తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశముందని బిలాల్ స్పష్టం చేశారు. "ఈ సాంకేతికత వెళ్తున్న తీరు చూస్తుంటే భయమేస్తోంది. మనందరినీ తుడిచిపెట్టే సామర్థ్యం ఏఐకి ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి మన దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది" అని ఎక్స్ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తోందో, దానికి తగినట్లుగా భద్రతా ప్రమాణా...