భారతదేశం, మార్చి 23 -- హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కారు ప్రమాదంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మాగంటి పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. రెండో కుమార్తె గాయాలతో బయటపడ్డారు. ఇద్దరూ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

గచ్చిబౌలి సమీపంలో ప్రయాణించే సమయంలో వీరి ఫార్చ్యూనర్.. కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. ఆ తర్వాత ప్రమాదం జరిగింది. ఈ సమయంలో మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశర అందులోనే ఉన్నారు. అతివేగం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద తీవ్రతతో కారు దెబ్బతిన్నది. స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో పెద్ద కుమార్తె అక్షర తలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో కుమార్తె దిశర స్...