భారతదేశం, మార్చి 17 -- సాధారణ ఆరోగ్య సమస్యల నుంచి ప్రాణాంతక క్యాన్సర్ల వరకు కొన్ని వ్యాధులు పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా వస్తుంటాయి. ఇందులో థైరాయిడ్ క్యాన్సర్ ఒకటి. 2023లో 'జర్నల్ ఆఫ్ ఎండోక్రైన్ అండ్ మెటబాలిక్ రీసెర్చ్' ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. పురుషులతో పోలిస్తే మహిళల్లో ప్రారంభ దశలో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. అసలు మహిళలకే ఈ ముప్పు ఎందుకు? గుర్తించడం ఎలా? దీనిపై మణిపాల్ హాస్పిటల్ (ఘజియాబాద్) సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ కుందన్ పంచుకున్న కీలక సమాచారం మీకోసం..

మహిళల శరీరంలో జరిగే హార్మోన్ల హెచ్చుతగ్గులే దీనికి ప్రధాన కారణమని డాక్టర్ కుందన్ వివరిస్తున్నారు. ముఖ్యంగా:

అయితే, థైరాయిడ్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే దీనికి పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో ఉందని ఆయన భరోసా ఇస్తున్నారు.

చా...