భారతదేశం, మే 24 -- రాష్ట్రంలోని నిరుద్యోగులైన మహిళలకు ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించబోతోంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను ఈ ఏడాది చివరికల్లా భర్తీ చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగనుంది.

గత మూడేళ్లుగా అంగన్‌వాడీ సిబ్బందికి సూపర్‌వైజర్లుగా ప్రమోషన్లు రావడం, కొందరు ఉద్యోగులు పదవీ విరమణ పొందడం, మరికొందరికి ఇతర ప్రభుత్వ శాఖల్లో శాశ్వత ఉద్యోగాలు లభించడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైర్మెంట్ల ద్వారా కొత్తగా మరో 708 పోస్టులు తోడవ్వడంతో మొత్తం ఖాళీల సంఖ్య 15,982కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 35,781 అంగన్‌వాడీ కే...