మహాలక్ష్మి గ్యాస్ పథకానికి ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి.. లేకుంటే సబ్సిడీ కట్!
భారతదేశం, నవంబర్ 28 -- తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ పథకానికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పథకంలో పారదర్శకత పెంచడంతో పాటు నకిలీ లబ్ధిదారులను ఏరివేసేందుకు రేషన్ కార్డు, ఆధార్, ఎల్పీజీ (LPG) కనెక్షన్ వివరాల మ్యాపింగ్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
ప్రస్తుతం మార్కెట్లో గ్యాస్ ధరలు సామాన్యులకు భారంగా మారిన నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం పెద్ద ఊరటనిస్తోంది. అయితే ఈ ప్రయోజనం నిరంతరాయంగా కొనసాగాలంటే లబ్ధిదారులు తమ వివరాలను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడు తమ గ్యాస్ ఏజెన్సీ లేదా సంబంధిత అధికారుల వద్ద ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఒకవేళ ఆధార్ కార్డు లేని పక్షంలో అర్హులైన వారి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.