భారతదేశం, మార్చి 6 -- మీరు బాట్‌మాన్ అభిమానా? గతంలో మహీంద్రా విడుదల చేసిన 'బాట్‌మాన్ ఎడిషన్' ఎలక్ట్రిక్ కారును సొంతం చేసుకునే అవకాశం మిస్ అయ్యారా? అయితే మీకు ఇది ఒక శుభవార్త. 'ద డార్క్ నైట్' థీమ్‌తో రూపొందించిన మహీంద్రా BE 6 బాట్‌మాన్ ఎడిషన్ బుకింగ్స్‌ను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

తొలి విడతలో కేవలం 135 సెకన్లలోనే 999 యూనిట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అప్పటి నుంచి సోషల్ మీడియాలో వస్తున్న విపరీతమైన డిమాండ్, కస్టమర్ల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న మహీంద్రా, ఈ ప్రత్యేక ఎడిషన్‌ను మరోసారి అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఈ కార్ బుకింగ్ ప్రక్రియ చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. ఆ వివరాలు ఇవే:

గమనిక: ఇప్పటికే ఈ కారును కలిగి ఉన్న యజమానులు రిఫర్ చేస్తే, వారికి డెలివరీలో ప్రాధాన్యత ఇస్తామని సంస్థ పేర్కొంది.

క్రి...