భారతదేశం, జనవరి 22 -- ఏపీ లిక్కర్ కేసులో ఈడీ నుంచి నోటీసులు అందుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారు. 7 గంటల పాటు ఆయన విచారణ కొనసాగింది. లిక్కర్ పాలసీ విధాన నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేశారు.
ఈడీ విచారణ తర్వాత బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తిరిగి రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు.
"నేను రాజకీయాల నుంచి తప్పుకోను. నా భవిష్యత్ ప్రణాళికలను త్వరలో ప్రకటిస్తాను. ఈ నెల 25తో నాకు రాజకీయాల్లో ఏడాది ముగుస్తుంది. తిరిగి రాజకీయాల్లోకి వస్తాను" అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
పార్టీలో నంబర్ 2 స్థానం అనేది లేదని స్వయంగా వైఎస్ జగన్ చెప్పారని ఈడీకి తెలిపానని విజయసాయిరెడ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.