భారతదేశం, మార్చి 19 -- న్యూ ఢిల్లీ: పసిడి ప్రియులకు ఇది గమనించదగ్గ సమయం. అంతర్జాతీయ మార్కెట్‌లో గత రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు వరుసగా క్షీణిస్తున్నాయి. గురువారం ఆసియా ట్రేడింగ్ సమయంలో స్పాట్ గోల్డ్ ధర 1 శాతం తగ్గి గరిష్ఠ స్థాయి నుంచి 4,844 డాలర్లకు (ప్రతి ఔన్సు) చేరుకుంది. వెండి ధర మరింత ఎక్కువగా 2.45 శాతం పతనమై 75.6 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

బుధవారం జరిగిన ట్రేడింగ్‌లో ఇవి ఏకంగా 4 శాతం మేర నష్టపోవడం గమనార్హం. పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ మేఘాలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేసిన హెచ్చరికలే ఈ పతనానికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

వడ్డీ రేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ అనుసరిస్తున్న తీరు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. వడ్డీ రేట్లలో ప్రస్తుతా...