భారతదేశం, జూన్ 23 -- పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేతిలో ఘోర పరాజయం పాలైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. పార్టీ వ్యవస్థాపకురాలు మమతా బెనర్జీ చేతుల్లోంచి టీఎంసీ పగ్గాలు చేజారుతున్నట్లు స్పష్టమవుతోంది. సోమవారం జరిగిన ఒక కీలక పరిణామంలో తిరుగుబాటు వర్గం ఆమెను పార్టీ అధినేత్రి (చైర్‌పర్సన్) పదవి నుంచి తొలగించింది. ఆమె స్థానంలో సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ను కొత్త చైర్‌పర్సన్‌గా ఎన్నుకుంది.

తిరుగుబాటు వర్గం నిర్వహించిన సమావేశానికి టీఎంసీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 60 మంది హాజరయ్యారని లేదా మద్దతు ప్రకటించారని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. వీరితో పాటు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన దాదాపు 70 మంది మాజీ కౌన్సిలర్లు, పలు జిల్లాల ప్రతినిధులు కూడా ఈ భేటీల...